
ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్లకు గాయాలు
భైంసా, వెలుగు : నిర్మల్‌జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కుక్కలు స్వైర విహారం చేశాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు కుక్కల దాడి జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాంపస్ లో రెండో సంవత్సరం ఇంజినీరింగ్చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలు కాగా, స్థానిక దవాఖానాలో ట్రీట్‌మెంట్‌చేసి పంపించారు. పరీక్షలు జరుగుతుండగా..చికిత్స తర్వాత స్టూడెంట్లు వచ్చి పరీక్షలు రాశారని అధికారులు తెలిపారు. కుక్కల దాడితో విద్యార్థులు భయపడుతున్నారు. గతంలోనూ విద్యార్థులను పందులు, కుక్కలు గాయపరిచాయని చెబుతున్నారు.