మహిళా యూనివర్సిటీలో కుక్కల హల్ చల్

మహిళా యూనివర్సిటీలో కుక్కల హల్ చల్

 

 

  • ఇద్దరు డిగ్రీ విద్యార్థినుల వెంటపడ్డ కుక్క
  • భయంతో పరుగులు తీసి కిందపడ్డ బాధితులు
  • తల, ముఖానికి గాయాలు

బషీర్ బాగ్, వెలుగు: కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వెంటపడి మరీ దాడులకు తెగబడుతున్నాయి. సోమవారం క్యాంపస్​లో నడుచుకుంటున్న వెళ్తున్న ఇద్దరు డిగ్రీ విద్యార్థినులను కుక్క వెంబడించింది. 

దీంతో వారు భయంతో పరుగులు తీయగా, కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన తోటి విద్యార్థులు కుక్కను అదిలించి, గాయపడిన ప్రజ్ఞ , అంకిత ను సమీప హాస్పిటల్​కు తరలించారు. కాగా, వర్సిటీ లోపల కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.