రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ అరికట్టేందుకు పోలీసులు చర్యలు మరింత కఠినం చేశారు. పబ్బులు, క్లబ్ లపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో శిక్షణ పొందిన స్పెషల్ డాగ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. డ్రగ్స్ ఆనవాళ్లను స్నిపర్ డాగ్స్ గుర్తించనున్నాయి. ఇటీవల నగరంలో డ్రగ్స్ వాడకం పెరిగింది. దీనిపై కఠినంగా వ్యవహరిస్తోంది సర్కార్.
డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పబ్ ,క్లబ్బుల్లో డ్రగ్స్ విరివిగా వాడుతున్నట్లు ఇటీవల పోలీసులు గుర్తించారు. దీంతో వికెండ్ సందర్భంగా పలు పబ్ లపై తనిఖీలు చేపట్టారు.