300 మంది ప్రయాణికులతో వెళ్తు్న్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌లోని దోహా నుంచి నాగ్‌పూర్ వస్తున్న ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
దోహా నుండి నాగపూర్ వెళ్తున్న ఖతార్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లించారు. నాగపూర్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దారి మళ్లిస్తున్నట్లు ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రకటించడంతో 300 మంది ప్రయాణికులు కాస్త టెన్షన్ పడ్డారు. ఎడతెరిపిలేని వర్షాలకు వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ : శంషాబాద్లో విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత అందులోని 160 మంది ప్రయాణికులను నోవాటెల్‌కు తరలించారు. వాతావరణం అనుకూలించి, విమానానికి అనుమతులు వచ్చిన తర్వాత ప్రయాణికులతో విమానం మళ్లీ బయలుదేరింది.