వైసీపీకి షాక్: డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకీ రెట్టింపవుతుంది. నామినేషన్ల పర్వం కూడా పూర్తైన క్రమంలో నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీ ఫిరాయింపులు కూడా ముమ్మరం చేశారు.. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు.

తాడికొండ నియోజకవర్గం నుండి టికెట్ అధిచిన ఆయనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక పార్టీలోనే ఉండి అవమానాలు ఎదుర్కోవడం కంటే రాజీనామా చేయటం బెటర్ అని ఆలోచించిన డొక్కా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సీఎం జగన్ కు పంపారు. త్వరలోనే అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు డొక్కా