Dokka Seethamma Biopic: వివాదంలో డొక్కా సీతమ్మ బయోపిక్.. అసలేమైందంటే?

Dokka Seethamma Biopic: వివాదంలో డొక్కా సీతమ్మ బయోపిక్.. అసలేమైందంటే?

ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపునింపి, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు గాంచారు డొక్కా సీతమ్మ. ఆ స్ఫూర్తిప్రదాత జీవితం సినిమాగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో నిర్మాత వి.ప్రభాకర్ గౌడ్, దర్శకుడు రామకృష్ణ స్పందించారు.

దర్శక రచయిత రామకృష్ణ మాట్లాడుతూ ‘డొక్కా సీతమ్మ పేరుతో తొలుత ఓ నాటకం రాసి 2015 రాజమండ్రిలో నిర్వహించాం. తర్వాత  2016 లోనే ఈ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేశాం. ఇప్పుడు  మా  రచనను కాపీ కొడుతూ వేరొక సంస్థ వారు కూడా సినిమా తీయడం మా దృష్టికి వచ్చింది. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నాం’అని చెప్పారు.

నిర్మాత ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ‘ఎంతో కాలంగా ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం.  కాపీ రైట్ యాక్ట్ మాకు అనుకూలంగా ఉంది. అయినప్పటికీ మరొకరు సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం’అని అన్నారు. ఈ సమావేశంలో సీతమ్మ చరిత్ర మొదటి రచయిత వంశీయులు మిర్తిపాటి రామాంజనేయులు, సినీ దర్శకుడు సాయికృష్ణ, కెమెరామెన్ వాసువర్మ పాల్గొన్నారు.