ముంబై: దేశీ స్టాక్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.70 వద్ద కొనసాగుతుంది. అమెరికా సూచీలు వరుసగా రెండో రోజూ భారీ లాభాలతో ముగిశాయి. నెల రోజులుగా ఉక్రెయిన్–రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ముందడుగు పడటం, అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి మొగ్గుచూపడం.. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచాయి. మరోవైపు చమురు ధరలు దిగిరావడం కూడా సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్–30 సూచీలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం: