టెక్స్ టైల్స్ కంపెనీ మై ట్రైడెంట్‌‌‌‌లక్ష్యం.. వెయ్యి కోట్ల పెట్టుబడి

టెక్స్ టైల్స్ కంపెనీ మై ట్రైడెంట్‌‌‌‌లక్ష్యం.. వెయ్యి కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు: దేశీయ టెక్స్​టైల్​ కంపెనీ మై ట్రైడెంట్2027 నాటికి భారత వ్యాపారం మూడు రెట్ల వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2025-–26లో క్యాపిటల్ ​ఎక్స్​పెండించర్​కోసం రూ.1,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది.దేశీయ టెక్స్​టైల్, నూలు, ఇంధన వ్యాపారాల్లో ఆస్తుల పెంపు కోసం భారీగా నిధులను కేటాయించనుంది. 

విస్తరణలో భాగంగా లగ్జ్​హోం వెర్టికల్​ద్వారా లగ్జరీ  విభాగంలోకి మై ట్రైడెంట్ ప్రవేశించింది.హస్తకళ, హోమ్​టెక్స్ ​​టైల్​లో క్వాలిటీ ప్రొడక్టులను దీని ద్వారా అందిస్తారు. ఈ కలెక్షన్​లో ఎంపిక చేసిన ప్రీమియం బెడ్డింగ్‌‌‌‌తో  పాటు అత్యుత్తమ మృదుత్వం, మన్నిక కలిగి ప్రత్యేకంగా రూపొందించిన టవల్స్​కూడా ఉన్నాయి. ధరలు రూ.4,000 నుంచి రూ.40,000 వరకు ఉంటాయి.