ఇది కదా టైమింగ్ అంటే..ట్రాఫిక్‌లోనూ ఆన్‌టైమ్‌లో పిజ్జా డెలివరీ..

ఎటు చూసినా విపరీతమైన ట్రాఫిక్, కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి బుధవారం ( సెప్టెంబర్ 27) బెంగళూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనం ఒక ఇంచు కదలాలన్నా ఎంతో సమయం పట్టింది. ఎంతో మంది ప్రజలు కార్లలోనే గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షిస్తూ ట్రాఫిక్‌ జామ్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. కావేరీ జలాల వివాదంతో ముందు రోజు జరిగిన బంద్‌ ప్రభావంతో బెంగుళూరులో నిన్న భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.  అయినా పిజ్జా డెలివరీ బాయ్ అరగంటలో డెలివరీ చేసి నెటిజన్ల ప్రశంసలు పొందాడు. 

లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో బుధవారం ( సెప్టెంబర్ 27)సాయంత్రం నుంచి రాత్రి వరకు బెంగళూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి.

హైదరాబాద్‌(Hyderabad)లో ట్రాఫిక్ అయితేనే మనం పది నిమిషాలు ఆగలేము. ముందున్న వాహనాలకు ఒకటే హారన్ కొడుతాము. కానీ బెంగళూరు(Bengaluru)లో ఒక్క సారి రోడ్లమీద వాహనాలు స్ట్రక్ అయితే ఇక అంతే సంగతులు. అది క్లియర్ అవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే తాజాగా బెంగళూరులో బుధవారం ( సెప్టెంబర్ 27) సాయంత్రం ట్రాఫిక్ జామ్( traffic) ఏర్పడింది. ఈవినింగ్ అవడంతో ఆఫీసుల నుంచి వచ్చే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సహజంగానే వారు అలిసిపోయి, ఆకలితో ఇంటికి వెళ్తుంటారు. కాబట్టి ఆసహనంతో ఉంటారు. ఎలాగో రోడ్లపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోతాయని వారికి తెలుసు. ఆ ట్రాఫిక్‌లో ఓ వినుత్న సంఘటన చోటుచేసుకుంది. అంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ డామినోస్ డెలివరీ సిబ్బంది కస్టమర్‌కు పిజ్జా అందించారు. ట్రాఫిక్ లో ఉన్న కస్టమర్ ను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆకలిని తీర్చారు.లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డెలివరీ బాయ్ తమను వెతుక్కుంటూ వచ్చి పిజ్జా(pizza)ను అందించినట్లు ఆ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

 బెంగళూరు నగరంలో  ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి ఏంటో అక్కడి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే ఓ కస్టమర్ ఆకలి వేయడంతో లైవ్ లోకేషన్ ట్రాకింగ్‌ను వాడుకుని పిజ్జాను ఆర్డర్ పెట్టకున్నాడు. డొమినోస్ వారికి ఫోన్ చేసి ముందే వారి పరిస్థితి చెప్పడంతో, అర్థం చేసుకున్న సిబ్బంది పిజ్జాను పంపిస్తామని అన్నారట. దాంతో అతన్ని ట్రాక్ చేసుకుంటు వచ్చి సమయానికి డెలివరీ ఇచ్చారు బాయ్స్. ఈ వీడియో చూసిన నెటిజన్లు డామినోస్ డెలివరీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు కొందరు బెంగళూర్ ట్రాఫిక్‌పై జోకులు వేస్తున్నారు. ఈ సారి ఇంటి నుంచే క్యారియర్లు తీసుకువెళ్లాలని కొందరంటుంటే మరి కొందరు గ్యాస్‌తో పాటు ఇతర కిచెన్ సామాగ్రి కూడా తీసుకెళ్లాలేమో అని కామెంట్లు చేస్తున్నారు..

బారులు తీరిన వాహనాలు.. 

 మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్,  శనివారం, తర్వాత ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో  బుధవారం ( సెప్టెంబర్ 27) సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

>ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పిజ్జా డెలివరీ బాయ్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే.. ఇంకొందరు తమకు ఎదరైన చేదు అనుభవాన్ని గుర్తు కామెంట్స్‌లో పెడుతున్నారు.