ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ

ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ

దుండిగల్, వెలుగు: దుండి గల్ మున్సిపాలిటీ, దొమ్మర పోచంపల్లి సబ్ డివిజన్  విద్యుత్ ఏఈ ఎస్.సురేందర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ సిటీ రేంజ్​యూనిట్–2 డీఎస్పీ శ్రీధర్​ తెలిపిన ప్రకారం..  దొమ్మర పోచంపల్లి పరిధి బౌరంపేటలో ఓ వ్యక్తికి చెందిన భవనం ముందు నుంచి11 కేవీ విద్యుత్ లైన్ ను తొలగించడానికి ఏఈ రూ.30 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.  గురువారం ఏఈ కార్యాలయానికి వెళ్లారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సురేందర్​రెడ్డిని అరెస్ట్ చేసి, నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.