రాజన్నసిరిసిల్ల,వెలుగు : అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులకు బిల్లులు ఎగ్గొట్టి ఇప్పుడు ముందుండి ఇప్పిస్తానని ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి కటుకం మృత్యుజయం అన్నారు. గురువారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు చెల్లించకుండా సర్పంచులను ముప్పుతిప్పలు పెట్టింది బీఆర్ఎస్ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిన చందంగా కేటీఆర్ తీరు ఉందని విమర్శించారు. టౌన్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాశ్, బాల్ రాజ్, సూరదేవరాజ పాల్గొన్నారు.
కేటీఆర్ బాధ్యత వహించాలి
ఎల్లారెడ్దిపేట, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచుల ఆత్మహత్యలకు మాజీ మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య డిమాండ్చేశారు. గురువారం ఎల్లారెడ్దిపేట పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచుల బిల్లుల కోసం తాను పోరాటం చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉండి బిల్లులు ఇవ్వకపోవడంతో ఎంతో మంది సర్పంచులు తమ ఇండ్లు, భార్యల మెడల్లోని పుస్తెలతాడులు కూడా అమ్ముకున్నారని ఆరోపించారు.
ముస్తాబాద్, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో సర్పంచుల పట్ల నిర్దయగా వ్యవహరించిన బీఆర్ఎస్.. అధికారం పోగానే వారిపై జాలి చూపడం సరికాదని కాంగ్రెస్ ముస్తాబాద్లీడర్లు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.