సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ 80 ఏళ్ల కిందట వాడిన క్యాప్ వేలంలో రూ. 2.63 కోట్ల ధర పలికింది.1947–48లో ఇండియా.. ఆసీస్‌లో పర్యటించిన సందర్భంగా బ్రాడ్‌మన్ ఈ టోపీతో బరిలోకి దిగాడు. మామూలుగా ఆసీస్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు క్రికెటర్లకు ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను ఇస్తారు. రంగు వెలిసిపోయినా, చిరిగిపోయినా ఆసీస్ క్రికెటర్లు మ్యాచ్‌ల్లో ఈ క్యాప్‌నే ధరిస్తారు.
ఇక ఇండియాతో జరిగిన 4 టెస్టుల ఆ సిరీస్‌లో సొంతగడ్డపై చివరిసారి ఆడిన బ్రాడ్‌మన్ 3 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ సహా 715 రన్స్ చేశాడు. 2010 నుంచి బ్రాడ్‌మన్ హోమ్ టౌన్ అయిన బౌరాల్‌లోని మ్యూజియంలో ఈ క్యాప్‌ను భద్రపరిచారు. ప్రస్తుత యజయాని 2003లో ఈ క్యాప్‌ను కొనుగోలు చేశాడు.