IND vs SA: హిట్‌మ్యాన్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ తీరుపై రోహిత్ సిరీస్

IND vs SA: హిట్‌మ్యాన్‌కు కోపమొచ్చింది.. ఐసీసీ తీరుపై రోహిత్ సిరీస్

కేప్‌టౌన్‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్ట్ రోజన్నర వ్యవధిలో ముగిసిన విషయం తెలిసిందే. కేవలం 107 ఓవర్లలో ఈ మ్యాచ్ ఫలితం వచ్చేసింది. దీంతో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ సమయం ముగిసిన టెస్ట్‌గా చరిత్ర సృష్టించింది. దీనిపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తక్కువ రేటింగ్ ఇస్తూ.. భారత పిచ్‌లపై నోరు పారేసుకుంటున్న ఐసీసీ పెద్దలకు హిట్‌మ్యాన్‌ తగిన బుద్ధి చెప్పాడు. ఇలాంటి పిచ్‌లపై  ఆడటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న రోహిత్.. ఐదు రోజులు ఆట సాగనప్పుడు భారత పిచ్‌లను విమర్శించే ఐసీసీ పెద్దల కపటబుద్ధిని ప్రశ్నించాడు.

"ఈ మ్యాచ్‌లో ఏం జ‌రిగిందో, పిచ్ ఎలా ప్రవ‌ర్తించిందో మనందరం చూశాం. నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నాకు అభ్యంతరం లేదు. కేప్‌టౌన్ పిచ్‌‍ను ఒక ఉదాహరణగా చెప్తున్నా.. భార‌త పిచ్‌ల‌పై ప‌దే ప‌దే నోరు పారేసుకోవద్దని ఐసీసీని కోరుతున్నా. అవును ఇలాంటి పిచ్ ప్రమాదకరం కావొచ్చు.. సవాలుతో కూడుకున్నది కావొచ్చు.. మేము ఇక్క‌డికి వ‌చ్చిందే ఆ స‌వాళ్ల‌ను స్వీకరించడానికి. భార‌త ప‌ర్యట‌న‌కు వ‌చ్చే జ‌ట్లకు కూడా కొన్నిసార్లు అలాంటి ప‌రిస్థితులే ఎదుర‌వుతాయి. అందుక‌ని పిచ్‌లకు రేటింగ్ చేసే సమయంలో మ్యాచ్ రిఫరీలు తటస్థంగా ఉండాల్సిన అవసరం ఉంది.." అని రోహిత్ ప‌రోక్షంగా ఐసీసీ కపట వైఖ‌రిపై విమ‌ర్శ‌లు గుప్పించాడు.

యావరేజ్ రేటింగ్

కాగా, వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 నాకౌట్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన ఈడెన్ గార్డెన్స్‌(కోల్ కతా), వాంఖ‌డే(ముంబై), నరేంద్ర మోడీ స్టేడియం(అహ్మదాబాద్‌) పిచ్‌ల‌పై ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీలు నానా ర‌చ్చ చేసిన విషయం తెలిసిందే. సరైన పిచ్‌లలు తయారుచేయకపోయారంటూ.. యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. ఇవి మనసులో పెట్టుకున్న రోహిత్.. ఆ సందర్భం వచ్చింది కనుక ఐసీసీ తీరుపై విమర్శలు గుప్పించాడు.