ట్రంప్ నన్ను అసభ్యంగా తడిమిండు...మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్ సంచలన ఆరోపణలు 

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై ఓ మాజీ మోడల్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ట్రంప్ తనను అసభ్యకరంగా తడిమాడని మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్ ఆరోపించారు. ట్రంప్ టవర్ లో 1993లో ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. జూమ్ ద్వారా డెమోక్రటిక్ ప్రచార బృందానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు.

ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్ స్టీన్ తో స్టాసీ విలియమ్స్ 1993లో డేట్ చేశారు. క్రిస్మస్ పార్టీలో ట్రంప్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ‘‘కొన్ని రోజుల తర్వాత జెఫ్రీ వచ్చి న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ కు నన్ను తీసుకెళ్లాడు. అప్పుడు ట్రంప్ నన్ను అసభ్యకరంగా తడిమాడు. ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేశాడు. నన్ను చూసి జెఫ్రీ, ట్రంప్ నవ్వుకున్నారు’’ అని ఆమె వెల్లడించారు.    

ప్రెసిడెంట్ పదవికి ట్రంప్ అన్​ఫిట్: కమల 

అమెరికా ప్రెసిడెంట్ పదవికి డొనాల్డ్ ట్రంప్ అన్​ఫిట్ అని డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి కమలా హారిస్ కామెంట్ చేశారు. దేశాన్ని నడిపించేందుకు ఆయన అనర్హుడన్నారు. ఆయన ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడు అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉండే మిలటరీకి బదులు హిట్లర్ లాంటి జనరల్స్ కావాలని కోరుకున్నారని గుర్తుచేశారు. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న హిట్లర్ లాంటి నాయకత్వం కావాలని కోరుకున్నారని ట్రంప్​పై మండిపడ్డారు. ట్రంప్ ఆలోచనలు ఎలా ఉంటాయో అమెరికా ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.