
అమెరికా అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలతో ప్రపంచానికి షాక్ ఇస్తున్న డోనాల్డ్ ట్రంప్.. మరో బాంబు పేల్చారు. విదేశీ కార్లపై దిగుమతి సుంకాన్ని 25శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. ఈ సుంకాల నిర్ణయం శాశ్వతమని స్పష్టం చేశారు స్పష్టం చేశారు ట్రంప్. తమ దేశంలో తయారు కాని అన్ని కార్లపై అమెరికా 25శాతం సుంకాన్ని విధించనున్నట్లు తెలిపారు ట్రంప్. అయితే.. అమెరికాలో తయారయ్యే కార్లపై ఎలాంటి సుంకం ఉండదని క్లారిటీ ఇచ్చారు ట్రంప్.
ఏప్రిల్ 3 నుంచి కొత్త దిగుమతి సుంకం అమల్లోకి వస్తుందని తెలిపారు ట్రంప్. ఓవల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటించారు ట్రంప్. దేశీయ తయారీని మరింత ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అమెరికాలో తయారయ్యే కార్లపై ఎలాంటి సుంకం ఉండదని తెలిపారు ట్రంప్.
ట్రంప్ తాజా నిర్ణయం ఆటోమేకర్ సప్లై చైన్ ను దెబ్బతీస్తుందని.. అంతేకాకుండా ఇన్ ఫ్లేషన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని ఆటోమొబైల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు.ట్రంప్ తాజా నిర్ణయం వెనక ఎలాన్ మస్క్ పాత్ర ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.