అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న వేళ..రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాట్లు ఒకరిపై ఒకరు ఆసక్తి కర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన డిబేట్ లో తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై విమర్శలు వస్తున్నాయి. ఆయన అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత డోనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. అదే సమయంలో బైడెన్ కంటే వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ బెటర్ అని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
2024 ఎన్నికల బరినుంచి జో బైడెన్ తప్పుకుంటున్నాడు అనే వినిపిస్తున్న ఊహాగానాల మధ్య డోనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన ఎలక్షన్ డిబేట్ లో బైడెన్ చెత్త ప్రదర్శన ఇచ్చారు. అతనో ముసలి చెత్త డంప్.. బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలింది కమలా హారీస్ ..ఆమె అధ్యక్ష పోటీలో ఉండొచ్చు కానీ.. ఆమె దేశానికి పనికిరాని రాజు అవుతారు అని ట్రంప్ పోస్ట్ కామెంట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు ఎప్పటివి అనేది స్పష్టత లేదు గానీ.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
అంతకుముందు బైడెన్ పై విమర్శల దాడికి దిగిన ట్రంప్.. అతనిపై తీవ్రమైన కామెంట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్ పింగ్ వంటి పెద్ద తలలను ఎదుర్కోగలడా అని అనుమానం వ్యక్తం చేశారు. వారిని ఎదుర్కోవడం బైడెన్ వల్ల కాదు అన్నారు. ఇప్పుడు బైడెన్ అధ్యక్ష పోటీనుంచి తప్పుకుంటాడు అని వస్తున్న ఊహాగానాల క్రమంలో కమలాహారీస్ పై విమర్శలు చేస్తున్నారు .
అయితే బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటాడు అని వస్తున్న వార్తల క్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు, బైడెన్ తర్వాత పార్టీలో తర్వాత పోజిషన్ లోఉన్న కమలా హారీస్ స్పందించారు. ఇప్పటివరకు డెమోక్రాట్ల తరపున అధ్యక్ష పోటీలో నామినీ బైడెన్ అని..ట్రంప్ ను మరోసారి బైడెన్ ఓడిస్తాడని అంటున్నారు. డెమోక్రాట్ల టెక్సాస్ ప్రతినిధి లాయిడ్ డోగెట్ చేసిన వ్యాఖ్యలతో బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. బైడెన్ పోటీనుంచి తప్పుకుంటే మంచిదని లాయిడ్ డోగెట్ బహిరంగంగానే అనడంతో డెమోక్రాట్ల అధ్యక్ష నామిని ఎవరు అని సందేహాలతో ఈ వ్యాఖ్యానాలు వైరల్ అవుతున్నాయి.