ట్రంప్ పదాల గారడీ.. అర్థరాత్రి COVFEFE అని పెడితే 6గంటలు ఇంటర్నేట్ షేక్

ట్రంప్ పదాల గారడీ.. అర్థరాత్రి COVFEFE అని పెడితే 6గంటలు ఇంటర్నేట్ షేక్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి పోటీలో గట్టిగా ప్రచారం చేస్తున్నాడు. వెరైటీలు, కొత్త లాజిక్కులకు ట్రంప్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. కొత్త తరహాలో ప్రచారం చేస్తూ.. సామాజిక మాద్యమాల్లో, వార్తల్లోనూ నిలుస్తున్నాడు ట్రంప్. నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష పోటీలో ఆయన రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలో ఉన్నాడు. ఏడు సంవత్సరాల క్రితం ట్రప్ అర్థరాత్రి చేసిన ఓ ట్విట్ ఆరు గంటల పాటు ఇంటర్నెట్ ను షేక్ చేసింది. 2017 మేలో ఆయన పెట్టిన పదం అర్థం ఇప్పటికీ తెలియలేదు. Despite the constant negative press covfefe  అని మిడ్ నైట్ ట్విట్ చేశారు. 

ఇందులో అన్నీ పదాలకు అర్థాలు ఉన్నాయి కానీ, COVFEFE అనే పెద్ద మిస్టరీ మిగిలిపోయింది ఇప్పటికీ.. దాదాపు ఆరు గంటల సేపు సోషల్ మీడియాలో అదే పదం ట్రెండింగ్ లో ఉంది. చాలా మంది ఆ పదానికి నానా రకాలుగా అర్థాలు చెప్పడానికి ప్రయత్నించారు. ఇంటర్నెట్ లో 6 గంటల పాటు దీనిపై జోకులు, మీమ్స్ అవే నడిచాయి. ఆరు గంటల్లోనే లక్షల్లో లైకులు, రీట్విట్లు వచ్చాయి. చాలామంది ఆ పదానికి అర్థాన్ని వెతకడం కోసం జుట్టు పీక్కున్నారు.

ట్రంప్ చేసిన అన్ని ట్వీట్లలోకెల్లా ఇదే అత్యంత పాపులర్ ట్వీట్.  తన ట్వీట్ పై ఊహించని రెస్పాన్స్ వస్తుండటంతో ఆ ట్వీట్ చేసిన 6 గంటల తర్వాత ట్రంప్ మరో ట్వీట్ లో covfefe పై స్పందించారు. ఎవరైతే కౌఫెఫెకు అర్థం కనుక్కుంటారో??? ఎంజాయ్! అంటూ ట్వీట్ చేసి మళ్లీ అందర్ని డౌట్ లోకి నెట్టేశారు. 

చాలా మంది స్పెల్లింగ్ మిస్టేక్ రాశారని, కవరేజీ అని రాయబోయి Covfefe అని రాశారని అనుకున్నారు. ఇంటర్నెట్ లో అటెక్షన్ కోసం కావాలనే అలా మీనింగ్ లేని పదం రాశారని కొందరు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ మిస్టీరియస్ పదం పేరు మీద కాఫీ షాపులు కూడా పెట్టారు. ఓ అమెరికా పార్లమెంట్ సభ్యుడు ఈ పదంతో పార్లమెంట్ లో ఓ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత పలు సందర్భాలలో కూడా ట్రంప్ ఈ పదాన్ని వాడాడు. 2022లో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో పెట్టిన మొదటి పోస్ట్ లో కూడా ఐ యామ్ బ్యాక్ #covefe అని పెట్టారు. ఇప్పటికీ ఆ పదం అర్థం ఎవరూ కనుక్కోలేకపోయారు. ప్రచారంలో ట్రంప్ యాక్టీవ్ గా ఉండటంతో ఈ పదం మళ్లీ వైరల్ అవుతుంది. 

ALSO READ | ట్రంప్, కమల​ ఫోన్లపై చైనా హ్యాకర్ల కన్ను