అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేశారు. ప్రపంచ దేశాలలో అగ్ర రాజ్యమైన అమెరికాకు రెండవ సారి అధ్యక్ష పదవిని చేపట్టడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రంప్ గురించే చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షునికి జీతం ఎంత ఉంటుంది.. ఎలాంటి అలవెన్స్ లు ఇస్తారో ఓ సారి చూద్దాం.
దేశాధ్యక్ష పదవిని చేపట్టిన వారికి నెలకు రూ.28 లక్షల వేతనం, ఏడాదికి రూ.3.36 కోట్లు జీతంగా అందుతుంది. ఇతర ఖర్చుల కింద ఏడాదికి రూ.42 లక్షలు, ప్రయాణ ఖర్చులకి రూ.84 లక్షలు, వినోదం కోసం రూ.16 లక్షలు ప్రెసిడెంట్కు చెల్లిస్తారు. అధ్యక్షుడి అధికార నివాసంగా వైట్ హౌస్, దానిని నచ్చినట్లు మార్చుకోవడానికి రూ.84 లక్షలు అందిస్తారు.
అధికారిక పర్యటనల కోసం అత్యాధునిక సాంకేతిక, భద్రత కలిగిన కారు, మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ఫోర్స్ విమానం ఉపయోగిస్తారు. దేశాధ్యక్షుడికి ఎగ్జిక్యూటివ్ చెఫ్, ప్లంబర్, ఫ్లోరిస్ట్, హౌస్ కీపింగ్ వంటి ఇతర పనులు చేసేందుకు కనీసం 100 మంది సహాయకులు ఉంటారు. మాజీ అధ్యక్షులకు రూ.1.93 కోట్లు పింఛన్ అందుతుంది. ఆరోగ్య బీమా, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు.