డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ ఇంటర్వ్యూ : సైబర్ అటాక్ జరిగిందా ?

డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ ఇంటర్వ్యూ : సైబర్ అటాక్ జరిగిందా ?

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మాజీ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను US కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8గంటలకు ఇంటర్వ్యూ చేశారు. ఎక్స్ వేదికగా ప్రసారమైన డొనాల్డ్ ట్రంప్‌ ఇంటర్వ్యూకి టెక్నికల్ ఇష్యూ కారణంగా 40 నిమిషాలు లేటుగా ప్రసారమైంది. ఇంటర్వ్యూ ఎక్కువ మందికి చేరొద్దని డీడీవోఎస్ సైబర్ ఎటాక్ జరిగిందని ఎలన్ మస్క్ ఆరోపించారు. 

ఇంటర్వ్యూ ట్రాఫిక్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని ఎలన్ మస్క్ అన్నారు. ఇంటర్వ్యూ ప్రారంభమైన రెండు గంటల్లోనే 27 మిలియన్ల మంది దాన్ని చూడడానికి ఆన్ లైన్ కి వచ్చారు.  ఎక్స్‌లో లైవ్ పెట్టిన స్టార్టింగ్ లోనే ఏకంగా 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ఇంటర్వ్యూ కోసం లైవ్ కి వచ్చారు. మస్క్ ను ట్రంప్ అభినందించారు.

ఎక్స్ వేదికగా టెలికాస్ట్ చేసిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు కారణంగానే అధ్యక్షుడు జో బిడెన్ అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. డిబేట్‌లో బిడెన్‌ను నేను చిత్తుచిత్తుగా ఓడించాను. ఆ తర్వాత ఆయన బలవంతంగా ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. జూలైలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ మాట్లాడారు. 
 

ఇంటర్వ్యూ లింక్ ఇదే :