హుష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డ్రొనాల్డ్ ట్రంప్ ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. తనకు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు ఉన్న అక్రమ సంబంధం గురించి బయట చెప్పకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు భారీగా ఆస్తులు ముట్టజెప్పారని రుజువైంది. ట్రంప్ వాటికి తప్పుడు డాక్కుమెంట్లు కూడా సృష్టించాడు. ఈ కేసు ఆయనపై ఉన్న 34 అభియోగాలు నిజమేనని 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. జూలై 11న తుది తీర్పు వస్తుంది. అలాగే ఆరోజే ట్రంప్ కు శిక్ష కూడా ఖరారు అవుతుంది. ఇదే జరిగితే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వారిలో క్రిమినల్ కేసు నమోదైన మొదటి వ్యక్తి డ్రొనాల్డ్ ట్రంప్ నిచిపోతాడు.
గరిష్టంగా నాలుగేళ్లు ఆయనకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2006లో తనను లైంగికంగా వాడుకున్నాడని ట్రంప్ ఆ విషయం బయటకు రాకుండా ఉంచేందుకు ట్రంప్ ఆమెకు అక్రమంగా డబ్బులు అప్పగించారని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. యూస్ అధ్యక్ష ఎన్నికలకు 5నెలల ముందు కోర్టు తీర్పు రావడం చర్చనీయాంశంగా మారింది.