వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షుడినైతే వైస్ ప్రెసిడెంట్‌గా వివేక్ రామస్వామిని నామినేట్ చేస్తానని చెప్పారు. వివేక్‌తో పాటు వైస్ ప్రెసిడెంట్ల లిస్ట్‌లో మరో ఐదుగురు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. ‘మీరు ప్రెసిడెంట్ అయితే, వైస్ ప్రెసిడెంట్‌గా ఎవరిని నియమిస్తారు?’ అని బుధవారం జరిగిన ఫాక్స్ న్యూస్ ఈవెంట్లో ట్రంప్ సమాధానమిచ్చారు.
వివేక్ సహా సౌత్కరోలినా సెనేటర్ టిమ్ స్కామ్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, హవాయి మాజీ సభ్యురాలు తులసి గబ్బార్డ్, ఫ్లోరిడా నుంచి బైరాన్ డొనాల్డ్స్, సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్ కూడా తన వైస్ ప్రెసిడెంట్పదవికి లిస్ట్‌లో ఉన్నారని ట్రంప్ చెప్పారు.