
- స్వచ్ఛందంగా వెళ్లిపోతే లీగల్ రీ-ఎంట్రీకి చాన్స్ ఇస్తామని వెల్లడి
వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులకు ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. యూఎస్ నుంచి తమంతటతామే వెళ్లిపోవాలని అనుకుంటున్నవారికి(సెల్ఫ్ డిపోర్టేషన్) ఖర్చులకు డబ్బులు, ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ ఇస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలపగా..అది మంగళవారం టెలికాస్ట్ అయింది.
ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.."అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్నవారి కోసం సెల్ఫ్ డిపోర్టేషన్ ప్రోగ్రామ్ తెచ్చాం. అమెరికాలో అక్రమంగా ఉంటూ..ఇప్పుడు స్వచ్ఛందంగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నవారికి విమాన టికెట్లతో పాటు ఖర్చులకు కొంత డబ్బిస్తం. వెళ్లిపోయిన వారిలో మంచివారుంటే, వారిని చట్టపరమైన పద్ధతిలో వెనక్కి తీసుకొస్తాం. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొట్టడమే మా మొదటి లక్ష్యం" అని ట్రంప్ స్పష్టంచేశారు.