US ఇంటెలిజెన్స్ బోర్డ్‌కు కొత్త చైర్మన్.. ట్రంప్కు చాలా నమ్మకస్తుడు

US ఇంటెలిజెన్స్ బోర్డ్‌కు కొత్త చైర్మన్.. ట్రంప్కు చాలా నమ్మకస్తుడు

US ఇంటెలిజెన్స్ బోర్డ్‌కు కొత్త చైర్మన్ డేవిన్ నన్స్ను కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు. తనకు అత్యంత విధేయుడైన నన్స్కు ఈ పదవి కట్టబెట్టారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌సీఈవో అయిన నూన్స్.. కాల్పిఫోర్నియాకు చెందని రిపబ్లికన్ మాజీ కాంగ్రెస్ సభ్యుడు. 

అంతేకాదు ట్రంప్ మొదటి అధ్యక్ష పదవి కాలంలో యూఎస్ హౌజ్ ఇంటెలిజెన్స్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. నూన్స్ను యూఎస్ ఇంటెలిజెన్స్ బోర్డు చైర్మన్గా పేరును ప్రతిపాదిస్తూ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడయా పోస్ట్లో చెప్పారు. అడ్వైజరీ ప్యానెల్కు చైర్మన్గా ఉంటూనే.. ట్రూత్ సోషల్ సీఈవోగా నూన్స్ కొనసాగుతారని తెలిపారు.

2018లో ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు నూన్స్..ట్రంప్కు నమ్మిన వ్యక్తిగా ఉన్నారు. రష్యా కుట్రలను బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని విచారిస్తున్నప్పుడు ట్రంప్‌పై FBI కుట్ర పన్నిందని న్యూన్స్ వివాదాస్పద మెమోను విడుదల చేశారు.US ఇంటెలి జెన్స్ కమ్యూనిటీ కార్యకలాపాలు, యాజమాన్యంపై డేవిడ్  నూన్స్ స్వతంత్రంగా పనిచేస్తారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. 

మరోవైపు ట్రంప్ ప్రత్యేక మిషన్ల కోసం అధ్యక్ష రాయబారిగా మరొక బహిరంగ విధేయుడైన రిచర్డ్ గ్రెనెల్‌ను నియమించారు. వెనిజులా, ఉత్తర కొరియాతో సహా ప్రపంచంలోని కొన్ని హాటెస్ట్ స్పాట్‌లలో రిచర్డ్ గ్రెనెల్ పని చేస్తాడని ట్రంప్ ట్రూత్ సోషల్‌కి పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

2025 జనవరి20లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్..తన టీం సభ్యులను ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుంటున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కీలక శాఖల్లో తన విధేయులను నియమిస్తున్నారు. ప్రస్తుత FBI డైరెక్టర్‌గా ఉన్న క్రిష్టోఫర్ వ్రే స్థానంలో తనకు విధేయుడైన పటేల్ను ఇప్పటికే నియమించారు. కాస్ పటేల్ను నియమించిన కొద్దిరోజులకే డేవిడ్ నన్స్ను యూఎస్ ఇంటెలిజెన్స్ బోర్డు చీఫ్గా నియమించారు.