వాషింగ్టన్: రష్యా-, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడంపై తమ ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని అమెరికాకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు పాటుపడతామని చెప్పారు. గురువారం మార్ ~-ఎ~-లాగో ఎస్టేట్‌లో జరిగిన అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. " మేం మిడిల్ ఈస్ట్ లో క్రియాశీలకంగా పనిచేయబోతున్నాం. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై వచ్చిన ఒక రిపోర్టు నేను చూశాను. గత మూడు రోజుల్లోనే వేలాది మంది చనిపోయారు. మృతిచెందినవారిలో సైనికులతో పాటు పౌరులు కూడా ఉన్నారు. ఇలాంటి యుద్ధాన్ని ఆపడంతోపాటు ఉక్రెయిన్‌కు సైనిక సహాయం రూపంలో అందుతున్న అమెరికా వనరులను కాపాడటానికే మేం ప్రాధాన్యమిస్తాం " అని ట్రంప్ పేర్కొన్నారు.