నేను కూడా ఆ డ్రగ్ తీసుకున్నా..

తాను కూడా కరోనా నియంత్రణ కోసం మలేరియా డ్రగ్ తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించాడు. అమెరికాలో కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో తాను కూడా వారానికి పైగా యాంటీ మలేరియల్ డ్రగ్ అయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్నట్లు స్వయంగా ట్రంప్ తెలిపారు. కరోనావైరస్ తో పోరాడటానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మంచిగా పనిచేయదని అమెరికన్ వైద్యులు ప్రకటించిన తర్వాత కూడా తాను ఆ మందును తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించారు. కరోనావైరస్ తో పోరాడటానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ తగిన ఔషధం కాదని అమెరికా వైద్యాధికారులు ప్రకటించారు. అయినా కూడా ట్రంప్ మాత్రం ఆ ఔషధాన్ని వాడారు. ‘చాలామంది ఈ డ్రగ్ బాగా పనిచేస్తుందని చెప్పారు. అందుకే నేను కూడా సుమారు వారానికి పైగా ఈ ఔషధాన్ని తీసుకున్నాను. ప్రతిరోజూ ఒక ట్యాబ్లెట్ ను జింక్ తో కలిపి తీసుకున్నాను’ అని ట్రంప్ అన్నారు.

For More News..

ఇక్కడెందుకు కూర్చున్నారన్నందుకు కాల్చి చంపిన దుండగులు

కిస్సింగ్ వీడియో వైరల్.. యువతుల్ని చంపేసిన కుటుంబసభ్యులు

విడాకులకు దరఖాస్తు చేసిన ప్రముఖ నటుడి భార్య