US Elections 2024: బిడెన్ మాటలకు ట్రంప్ సీరియస్.. చెత్త ట్రక్కు ఎక్కాడు

US Elections 2024: బిడెన్ మాటలకు ట్రంప్ సీరియస్.. చెత్త ట్రక్కు ఎక్కాడు

ఎన్నికల సమయంలో నేతలు చేసే పనులు చాలా సరదాగా ఉంటాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు వింతవింత యాక్టివిటీస్ చేస్తుంటారు. ఒక మనదేశంలోనే కాదు.. అమెరికాలాంటి దేశాల్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి..నవంబర్5 అమెరికా ఎన్నికల క్రమంలో అధ్యక్ష పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను ప్రసన్నం చేసు కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గ్రీన్ బేలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్ చెత్త ట్రక్కు నడిపారు.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్..ట్రంప్ మద్దతుదారులనుద్దేశించి వ్యాఖ్యలను చేశారు. దీతో ట్రంప్ కు కోపం వచ్చింది. తన మద్దతుదారుల గురించి అనుచిత వ్యాఖ్య లు చేస్తావా అని బిడెన్ కు గట్టికౌంటర్ ఇవ్వాలనుకున్నారు. తన మద్దతుదారుల గురించి బిడెన్ చేసిన వ్యాఖ్యలను ఎగతాళి చేస్తూ అతని పేరుమీద ట్రంప్ ఓ చెత్త ట్రక్కును నడిపాడు.

Also Read : ఆర్టికల్ 370 గోడలను బద్దలు కొట్టాం

ఇంతకీ బిడెన్ ఎమన్నాడంటే.. 

మాజీ అధ్యక్షుడు, ఒకప్పటి  రియాలిటీ షో టీవీ స్టార్, ట్రంప్ మద్దతుదారులను చెత్త అని పిలిచాడు ప్రస్తుత అధ్యక్షుడు బెడిన్. అయితే ఇటీవల బిడెన్ చేసిన వ్యాఖ్య లపై అమెరికన్ ప్రజల దృష్టిని ఆకర్షించానలి ట్రంప్ ప్లాన్ చేసుకున్నాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బిడెన్ అలా సంబోధించిన ఒక రోజు తర్వాత.. గ్రీన్ బే లో చెత్త ట్రక్కును నడిపాడు. ఎన్నికల వేళ ఓటర్ల ను ఆకర్షించేందుకు ట్రంప్ ఆలోచన బాగానే ఉంది గానీ..అమెరికన్ ప్రజలు ట్రంప్ చర్యలకు స్పందిస్తారా లేదా అనేది నవంబర్ 5 వరకు వేచి చూడాలి.