Trump News: ప్లీజ్ ప్లీజ్ సార్.. డీల్ కోసం ప్రపంచ దేశాలు అడుక్కుంటున్నాయ్: ట్రంప్

Trump News: ప్లీజ్  ప్లీజ్ సార్.. డీల్ కోసం ప్రపంచ దేశాలు అడుక్కుంటున్నాయ్: ట్రంప్

Trump on Tariffs: ట్రంప్ చెప్పాడంటే చేస్తాడంతే అనే మాట మరోసారి రుజువైంది. అమెరికా సుంకాలపై ఇటీవల చైనా ప్రతీకాల సుంకాలను ప్రకటించిన వేళ.. ట్రంప్ గతంలో చెప్పినట్లుగానే మరో 50 శాతం సుంకాలను చైనా దిగుమతులపై ప్రకటించారు. దీంతో మెుదట 20 శాతం, తర్వాత 34 శాతానికి అదనంగా ప్రస్తుతం 50 శాతంతో కలిపితే చైనాపై 104 శాతం టారిఫ్ పడింది. కాళ్లకాడికి వచ్చే వరకు తగ్గేదేలే అన్నట్లుగా చైనాపై ట్రంప్ విరుచుకుపడుతూ.. తనకు డీల్స్ ఎలా చేయాలి, ఎవరిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అనే విషయం తెలుసనే సంకేతాలను ప్రపంచానికి పంపుతున్నారు. 

తాజాగా నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ తాను కాంగ్రెస్ కంటే మెరుగ్గా డీల్స్ చేయగలనని పేర్కొన్నాను. ప్రస్తుతం తాను చేస్తున్న పని అమెరికన్లకు తెలుసని, అందుకే వారు తనకు ఓటు వేశారని పేర్కొన్నారు. సుంకాలతో ఇబ్బంది పడుతున్న దేశాలను ఎగతాళి చేస్తూ ట్రంప్ తనతో చర్చల కోసం లీడర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో వారు తన మాట వినటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. చాలా దేశాల నాయకులు ప్లీజ్ ప్లీజ్ సర్ డీల్ చేసుకుందాం అంటూ కాళ్లబేరానికి వస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. తాజా పెంపుల తర్వాత చైనా తమకు పన్నుల రూపంలో మరింతగా చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.

 

ప్రస్తుతం ట్రంప్ తన చర్యల ద్వారా అమెరికాను తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా మార్చాలనుకోవటమే. దీనికి అనుగుణంగా వ్యాపారులు ఎంత వేగంగా అమెరికాకు తమ కార్యకలాపాలను మార్చుతారనే అంశం వేచిచూడాల్సిన విషయంగా నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో అమెరికాలోని బ్యాంకింగ్, టెక్నాలజీ, పరిశ్రమలకు చెందిన సీఈవోలు టారిఫ్స్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం గురించి ఆందోళన వ్యక్తం చేయటానికి వైట్‌హౌస్‌కి కాల్స్ చేస్తున్నట్లు బయటకు వచ్చింది. ఇదే కొనసాగితే స్టాక్ మార్కెట్ల మరింత పనతం రాజకీయంగా పెద్ద దెబ్బగా మారుతుందని ట్రంప్ సన్నిహితులు ఆయనను హెచ్చరించిన వేళ డీల్స్ చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సీఎన్ఎన్ నివేదించింది. 

మరోపక్క ఫార్మా రంగంపై కూడా త్వరలోనే టారిఫ్స్ ప్రకటిస్తానని ట్రంప్ పేర్కొనటంతో భారతీయ ఫార్మా సంస్థల షేర్లు భారీ క్షీణతను చూస్తున్నాయి. చైనాతో సహా అనేక దేశాల నుంచి ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు వస్తున్నాయని త్వరలో ప్రకటించే టారిఫ్స్ కారణంగా వారు తమ ప్లాంట్లను అమెరికా గడ్డపై ప్రారంభిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే చైనా విషయంలో కూడా ఇదే జరిగితే ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ fentanyl precursor chemicals ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడైంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఫార్మా యుద్ధానికి దారితీయెుచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రపంచంలోని దాదాపు 70 దేశాల ప్రతినిధులు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాయని ట్రంప్ అన్నారు. ప్రధానంగా జపాన్, దక్షిణ కొరియా, ఇండియా, తైవాన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో న్యూజిలాండ్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించగా, సియోల్ 16వేల కోట్ల ఎమర్జెన్సీ సపోర్ట్ ప్యాకేజీని ఆటో రంగానికి ప్రకటించింది.