న్యూయార్క్ : డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భయంకరంగా నవ్వుతుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆమె కంటే తానే చూడడానికి మంచిగా కనిపిస్తున్నానని తెలిపారు. పెన్సిల్వేనియాలోని విల్కెస్బారేలో జరిగిన ఎన్ని కల ప్రచార ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ కమలా హారిసైపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు.
'కమలా నోరు మూసుకుని తిరుగుతోంది. ఆమె నవ్వాలని నేను కూడా అదే కోరుకుంటున్న. చూడటానికి కమల కంటే నేను చాలా బాగుంటాను. ఆమెతోపోల్చితే.. నేను మంచిగా ఉంటానని భావిస్తున్న. తెలివితేటలు గల వ్యక్తిగా కనిపిస్తాను. ఆమె ఏ విష యాన్నైనా చెత్తగా చెబుతారు. మాటల్లోనే అబద్ధాలు దొరికిపోతాయి. టైమ్ మ్యాగజైన్ వద్ద కమలా హారిస్ ఫొటోలే లేవు' అని ట్రంప్ ఎద్దేవా చేశారు.