నేను ఓడిపోతే పవర్ ట్రాన్స్‌ఫర్ ఈజీ కాదు: ట్రంప్
వాషింగ్టన్: ఎలక్షన్స్ లో తన ప్రత్యర్థి జో బిడెన్ చేతిలో ఓడిపోతే పవర్ ట్రాన్స్ ఫర్ పీస్ పుల్ గా జరగదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పోస్టల్ ఓటింగ్ పై అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్.. ఎన్నికల రిజల్ట్ తనకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులోనే తేలుతుందని చెప్పారు. బుధవారం వైట్ హౌస్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘ఏం జరుగుతుందో చూద్దాం. మెయిల్ బ్యాలెట్స్ పై నేను ఫిర్యాదు చేస్తూనే ఉన్నా. బ్యాలెట్స్ అంటేనే డిజాస్టర్. వాటిని తొలగించాలి. మెయిల్ ఇన్ ఓటింగ్ లో అంతా మోసమే ఉంటుంది’ అని అన్నారు. ఎన్నికల తర్వాత పవర్ ట్రాన్స్ ఫర్ కు రెడీ గా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… పవర్ ట్రాన్స్ ఫర్ చేసే చాన్స్ లేదని, తాను మరోసారి అధికారంలోకి వస్తానని చెప్పారు.
ట్రంప్ వైపే ఇండియన్ అమెరికన్లు
ఇండియన్ అమెరికన్లు ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వే లో తేలింది. ప్రధాని మోడీతో ట్రంప్ కు ఉన్న ఫ్రెండ్ షిప్‌తోపాటు
12 అంశాలు దీనికి కారణమని వెల్లడించింది. ట్రంప్ ఇండియన్ అమెరికన్లను గౌరవిస్తారని, ఇండియా, మోడీని సమానంగా ట్రీట్
చేయడంతో ఆయనకు పాపులారిటీ పెరిగిందని సర్వే చెబుతోంది. ఇతర అధ్యక్షుల్లా.. కాశ్మీర్ అంశాల్లాంటి ఇండియా ఇంటర్నల్
వ్యవహారాల్లో ట్రంప్ జోక్యం చేసుకోలేదని తెలిపింది. ట్రంప్ లేకుంటే ఇండియాపై చైనా వార్ స్టార్ట్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది.
For More News..