ట్రంప్‌ను షూట్ చేసిన వీడియో వైరల్ : చెవికి గాయం

ట్రంప్‌ను షూట్ చేసిన వీడియో వైరల్ : చెవికి గాయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో ర్యాలీ చేస్తుండగా శనివారం కాల్పులు జరిగాయి. ఈ అటాక్‌లో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బెతెల్ పార్క్‌కు చెందిన  థామస్ మాథ్యూ క్రూక్స్‌(20) అనే షూటర్ గన్ తో షూట్ చేశాడు. వెంటనే అతన్ని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ షూట్ చేసి చంపేశాడు. అయితే క్రూక్ ట్రంప్ ను షూట్ చేసిన వీడియోను అక్కడ ఉన్న ఆడియన్స్ తీశారు. 

ALSO READ | అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు...

ఆ వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. వీడియోలో దుండగుడు ట్రంప్‌పై షూట్ చేసిన తర్వాత తుపాకీ కాల్పుల సౌండ్ తో ర్యాలీకి వచ్చిన వారిలో గందరగోళం ఏర్పడింది. బట్లర్‌లో బహిరంగ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా ఈ కాల్పులు జరిగాయి. ట్రంప్ చెవికి బుల్లెట్ తగిలి.. రక్తస్రావం అవుతుంది. వెంటనే ఆయనని భద్రతా సిబ్బంది హాస్పిటల్ కు తరలించారు. ట్రంప్ పై దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఓబామా ఖండించారు. అమెరికాలో ఇలాంటి అటాక్ లకు చోటు లేదని వారు గట్టిగా చెప్పారు.