ఉక్రెయిన్పై యుద్ధం ఆపాలి..లేకుంటే ఆంక్షలు తప్పవు:పుతిన్కు ట్రంప్ వార్నింగ్

ఉక్రెయిన్పై యుద్ధం ఆపాలి..లేకుంటే ఆంక్షలు తప్పవు:పుతిన్కు ట్రంప్ వార్నింగ్

ట్రంప్ మరోసారి ఉక్రెయిన్కు బాసటగా నిలిచారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది..ఇది మేం సహించం..యుద్దం ఆపకపోతే రష్యాపై బ్యాంకింగ్ ఆంక్షలు, సుంకాలు , ఇతర చర్యలను తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ఎనర్జీ గ్రిడ్‌పై రష్యా డ్రోన్ ,క్షిపణి దాడుల తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 

శుక్రవారం (మార్చి 7) నాడు జరిగిన దాడులతో ఉక్రెయిన్ పై రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగినట్లు తెలుస్తుంది.. శాంతి, కాల్పులు విమరణ చర్చలు, తుది పరిష్కారం దొరికే వరకు రష్యా యుద్ధాన్ని ఆపాలి.. లేకుంటే బ్యాంకింగ్, సుంకాలు వంటి కఠిన ఆంక్షలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 

రెండు వర్గాలు వెంటనే చర్చలు జరపాలని కోరారు. రష్యా, ఉక్రెయిన్లు ఆలస్యం చేయకుండా చర్చలకు రండి అని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. 

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ .. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని మందలించిన విషయం తెలిసిందే. అమెరికా సైనిక మద్దతు పట్ల జెలెన్ స్కీకి కృతజ్ణత లేదని ఆరోపించారు. తర్వాత ఐక్యరాజ్య సమితిలో  రష్యాకు మద్దతుగాఓటు వేసింది అమెరికా. దీంతో ఉక్రెయిన్ కు  యూరోపియన్ మిత్రదేశాలు మద్దతునిచ్చాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇటీవల ఫోన్ కాల్ చేసినందుకు ట్రంప్ కూడా ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు.