ట్రంప్ దూకుడు..స్టీల్, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్.. ఏ దేశాలపై ఎంత ప్రభావం అంటే.?

ట్రంప్ దూకుడు..స్టీల్, అల్యూమినియంపై  25 శాతం టారిఫ్.. ఏ దేశాలపై ఎంత ప్రభావం అంటే.?

అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ గా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు అల్యూమీనియం,  స్టీల్ దిగుమతిపై 25 శాతం అదనపు సుంకం(టారిఫ్) విధిస్తామని ప్రకటించారు.  ఇది వెంటనే  అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుందన్నారు. ఇటీవలే మెక్సికో, కెనాడా,చైనా దేశాల దిగుమతి సుంకాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే..

మొదటి సారి 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్  స్టీల్ పై 25 శాతం, 10 శాతం అల్యూమీనియంపై  టారిఫ్ విధించారు. కెనడా,బ్రెజిల్, మెక్సికో లాంటి దేశాలకు మినహాయింపునిచ్చారు.

ALSO READ | 40 మంది హసీనా మద్దతుదారుల అరెస్టు

ట్రంప్ నిర్ణయంతో  యూఎస్ ,కెనడా, మెక్సికో,బ్రెజిల్,చైనా,ఇండియా,కొలంబియా,వియత్నాం దేశాలపై ప్రభావం చూపనుంది. కెనడాపై అత్యధిక ప్రభావం చూపనుంది. ఎందుకంటే యూనైటైడ్ స్టేట్స్ కు అతిపెద్ద  స్టీల్ దిగుమతి దారు కెనడా.  అమెరికాకు కెనడా నుంచి  79 శాతం స్టీల్ ఎగుమతి  అవుతుంది. ఈ కొత్త సుంకాలతో  చిక్కులు కూడా అంతే పర్యవసానంగా ఉంటాయని చర్చ జరుగుతోంది.  వాటాదారులు, ముఖ్యంగా కెనడా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Trump 25% import tariff of Steel and Aluminum will impact these countries https://t.co/TGTjtZfDkT pic.twitter.com/PPko6bUJFw

— David Lee (@DavidLe76335983) February 9, 2025