డే లైట్ సేవింగ్ టైమ్​ను రద్దు చేస్తా: ట్రంప్

డే లైట్ సేవింగ్ టైమ్​ను రద్దు చేస్తా: ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమలులో ఉన్న డేలైట్ సేవింగ్ టైమ్(డీఎస్టీ) విధానాన్ని రద్దు చేస్తానని ప్రెసిడెంట్​గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తన ‘ట్రూత్’ సోషల్​ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. జనవరి 20న తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నారు. డీఎస్టీ మార్చి రెండో ఆదివారం ప్రారంభమవుతుంది.

 నవంబర్ మొదటి ఆదివారం ముగుస్తుంది. మార్చిలో ప్రజలు తమ వాచీల్లో టైమ్​ను గంట ముందుకు, సెప్టెంబరులో గంట వెనక్కి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలం చెల్లిన విధానం ప్రజలకు అసౌకర్యంగా మారిందని.. దీంతో దేశానికి ఆర్థికంగా భారం పెరుగుతుందని ట్రంప్ అన్నారు. ‘‘రిపబ్లికన్ పార్టీ డీఎస్టీని తొలగించడానికి బలంగా ప్రయత్నిస్తుంది. ఇది చిన్నదే కానీ దేశానికి కీలకమైన అంశంగా ఉంది. డీఎస్టీ అసౌకర్యంగా ఉంది, మన దేశానికి చాలా ఖర్చును పెంచుతున్నది” అని తన పోస్ట్​లో ట్రంప్ పేర్కొన్నారు.