డీల్కు ఒప్పుకోకుంటే బాంబులేస్తం: న్యూక్లియర్ ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

డీల్కు ఒప్పుకోకుంటే బాంబులేస్తం: న్యూక్లియర్ ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
  • మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఆ దాడులు ఉంటాయి
  • మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
  • న్యూక్లియర్ ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: తమతో న్యూక్లియర్ డీల్​కు ఒప్పుకోకపోతే బాంబులతో దాడి చేస్తామని ఇరాన్​ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించాడు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. మునుపెన్నడూ ఎరుగని రీతిలో దాడులు ఉంటాయన్నారు. మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఎన్​బీసీ న్యూస్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన కామెంట్లు చేశాడు. తాను నాలుగేండ్ల కింద చేసిందే మళ్లీ రిపీట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. న్యూ క్లియర్ డీల్​కు ఒప్పుకోవాల్సిందే అని పట్టుబట్టాడు.

కాగా, న్యూక్లియర్ డీల్​కు తాను సిద్ధంగా ఉన్నానని కొన్ని రోజుల కింద ఇరాన్‌‌కు ట్రంప్ లేఖ పంపించాడు. ప్రత్యక్ష చర్చలకు రావాలని కోరాడు. అందుకు సుమారు 2 నెలల డెడ్​లైన్ విధిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఆ లేఖపై ఇరాన్‌‌ అధ్యక్షుడు షెజెస్కియాన్ ఘాటుగా స్పందించాడు.

ట్రంప్‌‌తో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు అని తేల్చి చెప్పాడు. అదే సమయంలో పరోక్ష చర్చలకు దారులు తెరిచే ఉన్నాయని తెలిపాడు. షెజెస్కియాన్ కామెంట్లపై తాజాగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా, ట్రంప్ తన మొదటి (2017 – 21) పదవీకాలంలో అంతకుముందు ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని 2018లో రద్దు చేశారు.