బందీలను విడువకుంటే నరకం చూపిస్త.. హమాస్​కు డొనాల్డ్​ ట్రంప్​ వార్నింగ్​

బందీలను విడువకుంటే నరకం చూపిస్త.. హమాస్​కు డొనాల్డ్​ ట్రంప్​ వార్నింగ్​

న్యూయార్క్: హమాస్​ మిలిటెంట్​ సంస్థపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ విరుచుకుపడ్డారు. బందీలను విడిచిపెట్టకపోతే ఆ సంస్థకు నరకం చూపిస్తానని ఘాటుగా హెచ్చరించారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే వారిని విడిచిపెట్టాలని అల్టిమేటం జారీచేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్​ ఇచ్చారు. 

ఈ మేరకు ట్రంప్​ ‘ట్రూత్‌‌’ సోషల్‌‌ వేదికగా పోస్ట్‌‌ చేశారు.‘‘నేను అమెరికా ప్రెసిడెంట్​గా జనవరి 20న బాధ్యతలు చేపడుతున్నా. ఈ లోపు హమాస్​ తన చెరలో ఉన్న బందీలను విడుదల చేయాలి. లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడేవారికి నరకం చూపిస్తా. అమెరికా సుదీర్ఘ చరిత్రలోనే చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది”  అని హెచ్చరించారు.