![ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక బహుమతి](https://static.v6velugu.com/uploads/2025/02/donald-trumps-special-gift-to-pm-modi_CqeP9fRtab.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక బహుమతి అందజేశారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ అనే పుస్తకాన్ని ప్రధానికి అధ్యక్షుడు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ బుక్‌పై 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్' అని రాసి, ట్రంప్ సంతకం చేశారు. 320 పేజీల ఈ పుస్తకంలో 'హౌడీ మోదీ', 'నమస్తే ట్రంప్' కార్యక్రమాల తాలూకు ఫొటోలను పొందుపరిచారు. 2019లో హూస్టన్‌లోని ఒక ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన 'హౌడీ మోదీ' ర్యాలీకి 50,000 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరైన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో మోదీ, ట్రంప్ ఇద్దరూ ప్రసంగించారు.
ALSO READ | అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తా: ప్రధాని మోడీ
ఐదు నెలల తర్వాత ఫిబ్రవరి 2020లో అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో 'నమస్తే ట్రంప్' కార్యక్రమం జరిగింది. ఈ రెండు భారీ ఈవెంట్లకు సంబంధించిన ఫొటోలను మోదీకి ట్రంప్ గిఫ్ట్ ఇచ్చిన బుక్‌లో హైలైట్ చేశారు. అలాగే ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీ కాలం నాటి ఐకానిక్ క్షణాల తాలూకు ఫొటోలను కూడా పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇండియా వెబ్‌సైట్‌లలో సుమారు రూ. 6,000 ధరతో అందుబాటులో ఉంది. అలాగే ట్రంప్ స్టోర్‌లో 100 డాలర్లకు అందుబాటులో ఉంది.