భద్రాచలం,వెలుగు: ఏలూరుకు చెందిన భక్తులు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.25లక్షల విరాళం ఇచ్చారు. గురువారం రాత్రి ఈవో ఎల్.రమాదేవికి ఏలూరులోని ఆర్ఆర్ఆర్ పేటకు చెందిన డాక్టర్ యార్లగడ్డ చంద్రమౌళి కుమార్తె డాక్టర్ రాధిక అందజేశారు.