పాలమూరు, వెలుగు: విద్యా దానానికి మించిన పుణ్యకార్యం ఏదీ లేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైస్ మిల్ అసోసియేషన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందిస్తే, వారు తమ కాళ్లపై నిలబడి సమాజానికి సేవలందిస్తారని తెలిపారు.
మహబూబ్నగర్లో స్కిల్ డెవలప్మెంట్ పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. వాసవి ట్రస్ట్ సభ్యులు పేద విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి చదువుల కోసం సాయం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం 30 మంది పేద విద్యార్థులకు చెక్కులను పంపిణీ చేశారు. మురళి, పుల్ల కృష్ణయ్య, సత్యనారాయణ, చక్రధర్ గుప్తా, బాలాజీ, రామ్మోహన్, గుండా వెంకటేశ్, రమేశ్, కుమారస్వామి, వేణుగోపాల్, రాఘవేందర్ పాల్గొన్నారు.