తిరుమల శ్రీవారికి ఇవాళ(శుక్రవారం) ఉదయం ఓ అజ్ఞాత భక్తుడు భారీ కానుకలు సమర్పించుకున్నారు. ఆ భక్తుడు చెన్నైకు చెందిన ఓ వ్యాపారి అని తెలుస్తోంది. వేంకటేశ్వరుడికి బంగారు కఠి, వరద హస్తాలను విరాళంగా ఇచ్చారు. 3.5 కోట్ల రూపాయలతో ఆ నగలను తయారు చేయించారు.
వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో వాటిని శ్రీవారికి సమర్పించాడు. వజ్రాలు, కెంపులు పొదిగి దాదాపు 5.3కిలోల బరువు గల ఆ భరణాలను టీటీడీ అధికారులకు అందించారు. వాటిని అభిషేక సేవ తర్వాత స్వామి వారికి అర్చకులు అలంకరించారు. భక్తుడిని సత్కరించిన ఆలయ అధికారులు.. దాత వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.