ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: తన బర్త్‌డేను పురస్కరించుకొని ఓ యువకుడు ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష అందజేసి భక్తిని చాటుకున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాళ్లబండి మహేందర్చిన్ననాటి నుంచే ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఈ నేపథ్యంలోనే స్థానిక శంకర్గుట్టలోని ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా రూ.1 లక్షను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశాడు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రమా గౌడ్, సంజీవ్, ఎల్చాల మల్లేశ్, పిట్ల ఓం ప్రకాశ్, సుదర్శన్, రమేశ్, అభిలాష్, శేఖర్, తీగల మల్లేశ్, భూమేష్ రెడ్డి,అభిరామ్ అశోక్, శంకర్ గుట్ట కాలనీ వాసులు పాల్గొన్నారు.