
రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారానికి చెందిన గౌడ కులస్తులు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్శ్రీనివాస్రెడ్డిని కలిసి తమ గ్రామంలో సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. స్పందించిన ఆయన బుధవారం రూ.3 లక్షలు విరాళం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆయన ఆఫీస్‌కు వెళ్లిన గౌడ కులస్తులకు కోరిన వెంటనే విరాళం ప్రకటించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌రెడ్డిని కలిసిన వారిలో కోల కొమురయ్య, జలగం శ్రీనివాస్, అనిల్, రంగు కుమార్, బైరి యాకయ్య తదితరులు ఉన్నారు. .