కామేపల్లి సొసైటీ తాత్కాలిక చైర్మన్ గా వెంకటనర్సమ్మ

కామేపల్లి,  వెలుగు : కామేపల్లి సొసైటీ తాత్కాలిక చైర్మన్ గా సాతానిగూడెం గ్రామానికి చెందిన దొంగల వెంకటనర్సమ్మ ను బుధవారం ఎన్నిక చేస్తూ అసిస్టెంట్ రిజిస్టర్ సీహెచ్ రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చైర్మన్ గా ఉన్న తీర్థాల చిదంబర రావు పై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు.

దీంతో వైస్ చైర్మన్ గా ఉన్న కాట్రాల రోశయ్య తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. కాగా మళ్లీ డైరెక్టర్లు రోశయ్య పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు. దీంతో మిగతా  డైరెక్టర్లు వైస్ చైర్మన్ ను లాటరీ పద్ధతిలో ఎన్నుకోగా దొంగల వెంకటనర్సమ్మ ను వైస్ చైర్మన్ తో పాటు తాత్కాలిక చైర్మన్ గా ఎన్నిక చేశారు. ఈనెల 22న చైర్మన్ ను ఎన్నిక చేయడం జరుగుతుందని చెప్పారు.