అవునా నిజమా : గాడిద చీజ్ ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు.. ఈ చీజ్ తయారీ దేవ రహస్యం అంట..

అవునా నిజమా : గాడిద చీజ్ ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు.. ఈ చీజ్ తయారీ దేవ రహస్యం అంట..

ఛీ... గాడిద పాలతో చీజ్ ! ఇంతకీ తింటారా? అని ఎవరైనా అంటే.. వాళ్లకు అసలు విషయం తెలియదనుకోవాలి. ఎందుకంటే కిలో చీజ్ ధర 1100 డాలర్లట. అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 92 వేల రూపాయిలు.  . కనీసం ఓ యాభై గ్రాములైనా కొనుక్కొని తినేందుకు దేశవిదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు సెర్బియాకు వెళ్తారు. ఎందుకంటే డాంకీ చీజ్ దొరికేది ఆ ఒక్క దేశంలోనే కాబట్టి.  ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ ఈ చీజ్ నే తింటాడట. తన రెస్టారెంట్లలోనూ ఈ చీజీనే వాడతాడట. ఇంతకీ గాడిద పాల చీజ్లో అంత ప్రత్యేకత ఏముంది? అంత రేటెందుకు? అనే విషయాలు తెలుసుకుందాం. . .

ఒకప్పుడు ఊళ్లలో గాడిదపాలు అమ్మేందుకు వచ్చేవారు. ఈ మధ్య పట్టణాల్లో కూడా అక్కడక్కడా అమ్ముతున్నారు. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయనే నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు గాడిదపాలు తాగించేవారు. ఇంటిముందుకే గాడిదను తీసుకొచ్చి, మనముందే పాలు పిండి.. వేడి వేడి పాలను పిల్లల గొంతులో పోస్తారు. అయితే సెర్బియా దేశంలో సిమిక్ అనే పెద్దమనిషి గాడిద పాలతో చీజ్ తయారు చేసి అమ్ముతున్నాడు. దానికి ఎంత డిమాండ్ ఉందంటే... ఓ యాభై గ్రాముల చీజ్ తినేందుకే సెర్బియా వెళ్లేవారు కూడా ఉన్నారంటే ఇక మీరే అర్ధం చేసుకోండి

ALSO READ : Good Food : కొత్తిమీరతో కోటి లాభాలు.. ఈ స్టోరీ చదివితే మీరు రోజూ తింటారు..!

స్లోబోడన్ సిమిక్..

సెర్బియా ప్రాంతీయ పార్లమెంట్ సభ్యుడిగా  చేశాడని చాలా తక్కువమందికి తెలుసు. కానీ... గాడిద పాలతో తయారు చేసే చీజ్ అమ్మేవ్యక్తిగా మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలామంది గుర్తుపడతారు. సిమిక్ ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా గమ్మత్తుగా జరిగింది. 

సెర్బియా రాజధాని బెట్ గ్రేడ్​ కు  80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ నేచర్ రిజర్వ్ ఫారెస్ట్​ ను సిమిక్ కాపలా కాసే పనిలో ఉండేవాడు. ఆ ఫారెస్ట్​ లో  ఆయనకు అన్నిరకాల జంతువులు కనిపించినా గాడిదలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఓ 20 గాడిదలను స్వయంగా కొని, ఫారెస్ట్​ లో  వదిలేశాడు. కొన్నిరోజుల తర్వాత ఇంటి ఖర్చుల కోసమని గాడిద పాలను అమ్మడం మొదలు పెట్టాడు. అయితే వాటిని కొనేందుకు పెద్దగా ఎవరూ ఇష్టపడేవారు కాదు.. అప్పుడే ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. గాడిద పాలతో చీజ్ తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుంది? అని  వెంటనే చీజ్ తయారీని మొదలుపెట్టి, అమ్మడం మొదలుపెట్టాడు. కొనేందుకు జనాలు ఎగబడడంతో గాడిదలతో ఓ డెయిరీని ఏర్పాటు చేసి, చీజ్ తయారు చేస్తూ అమ్ముతున్నాడు.

ALSO READ : Good Health : మీ ఊపిరితిత్తులు బాగుండాలంటే.. ఈ 5 అలవాట్లు మానుకోండి..!

ఈ చీజ్ తయారీ దేవ రహస్యం...

నిజానికి గాడిద పాలతో చీజ్ తయారు చేయలేం. ఎందుకంటే పాలు తోడుకునేందుకు అవసరమైన 'కేసిన్' అనే ప్రొటీన్ గాడిద పాలలో ఉండదు. అయితే ఓ నిపుణుడి సాయంతో గాడిద పాలను కూడా చీజ్ గా మార్చే ప్రక్రియను కనుగొన్నాడు.. అదేంటో చెప్పమని ఎవరడిగినా 'అదో దేవ రహస్యం' అంటూ దాటవేస్తాడే తప్ప.. ఇప్పటి దాకా ఎవరికీ చెప్పలేదు. ఒక్కోసారైతే అది నాకు కూడా తెలియదు. మా వంటవారికి మాత్రమే తెలుసని చెబుతాడు..

అంత ధర ఎందుకు?

గాడిద పాలు ఆరోగ్యానికి మంచివని. చాలామంది నమ్ముతారు. అలాంటి గాడిద పాలతో చేసిన చీజ్ కావడంతో సహజంగానే దానికి డిమాండ్ పెరిగింది. పైగా ప్రపంచంలో మరెక్కడా దొరక్కపోవడం కూడా సిమిక్కు కలిసొచ్చింది. చీజ్ తయారీ విధానం కూడా రహస్యంగానే ఉంచుతూ, దాని ధరను అంతకంతకూ పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నాడు. అయితే పాల ఎగుమతిపై సెర్బియాలో ఆంక్షలు అమల్లో ఉండడంతో విదేశాలకు ఎగుమతి చేయలేకపోతున్నాడు. దీంతో ఈ చీజ్ తినాలనుకునేవారు  సెర్బియాకు వెళ్లి తినాల్సిందే. అందుకే గాడిద పాల చీజ్​కు అంత డిమాండ్.

ALSO READ : Good Health: దీని దుంప తెగ.. ఇది తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

50 గ్రాములే ఎందుకు?

తన దగ్గర ఉన్న 250 గాడిదల పాలతో రోజంతా కష్టపడితే 15 కిలోల చీజ్ మాత్రమే తయారవు తుందట. దానిని 50 గ్రాముల చొప్పున ప్రత్యే కంగా ప్యాక్ చేసి అమ్ముతారు. అంత తక్కువ మొత్తమే ఎందుకు? అని అడిగితే... 'ఈ చీజు 50 గ్రాములకు మించి తినలేం. దీనిని కూడా పది మంది తినొచ్చు. రుచి అద్భుతంగా ఉన్నా.. ఎక్కు వగా తినడం కష్టం. పైగా ధర కూడా ఎక్కువ  అంటాడు సిమిక్.

–వెలుగు, లైఫ్​–