హైదరాబాద్ సిటీలో గాడిద గుడ్డు పోస్టర్లు.. బడ్జెట్ పై బీజేపీకి కౌంటర్లు

హైదరాబాద్ సిటీలో గాడిద గుడ్డు పోస్టర్లు.. బడ్జెట్ పై బీజేపీకి కౌంటర్లు

హైదరాబాద్ సిటీలో ఇప్పుడు గాడిద గుడ్డు పోస్టర్లు హల్ చల్ చేస్తున్నాయి. సిటీ వ్యాప్తంగా బస్టాప్స్, జంక్షన్ల దగ్గర ఈ పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ప్రస్తావించలేదు.. తెలంగాణ రాష్ట్రానికి నయాపైసా ఇవ్వలేదంటూ అధికార కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంది.. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. వాళ్లు సాధించింది.. తెచ్చింది ఏంటో తెలుసా.. గాడిద గుడ్డు అంటూ బీజేపీకి చురకలు అంటిస్తూ.. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణకు పదేండ్లుగా అధికారంలో వున్న మోడీ సర్కార్.. చేసింది ఏమి లేదని, గాడిద గుడ్డని ప్రచారం చేసిన కాంగ్రెస్.. మళ్లీ నిన్న పార్లమెంట్ బడ్జెట్ లో తెలంగాణకు మోడీ సర్కార్ ఏమి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్న క్రమంలో  మరోసారి గాడిద గుడ్డు పోస్టర్లు వెలిశాయి.

ALSO READ | సమాఖ్య స్ఫూర్తి దెబ్బతీసేల కేంద్రం బడ్జెట్ : మంత్రి శ్రీధర్ బాబు