మనల్ని సేఫ్‌గా గమ్యస్థాలకు చేర్చే ఆటో, కార్ డ్రైవర్లతో రైడ్ మొత్తం మీద ఒక్కసారైనా మనం మాట్లాడుతుంటాం.. అలా మాట్లాడాల్సినప్పుడు మీరు ఏం అని పిలుస్తారు. సాధారణంగా అన్నా, భయ్యా, భాయ్, అంకుల్.. ఇలా పిలుస్తుంటారు. ఓ ఆటో డ్రైవర్ అన్న అని పిలుస్తున్నందకు బాధపడుతున్నాడు. తన ఆటో డ్రైవర్ సీటు వెనుక దూరాన్ని పాటించి సురక్షితంగా ఉండండి. నన్ను భయ్యా అని పిలవకండి.. ప్లీజ్, దాదా, భాయ్, బాస్, బ్రదర్ అని పిలవమని రాశాడు. అది ఓ యువతి ఫొటో తీసి ఎక్స్ లో అప్లోడ్ చేసింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
నిజంగా అన్నా అని పిలుస్తే ఇంత బాధగా ఉంటుందా అని నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. అయితే ఆ డ్రైవర్ అలా అమ్మాయిలను మాత్రమే ఉద్దేశించి అన్నాడా లేకా అందర్ని కలిపి రాసుకొచ్చాడా అనే విషయం తెలియదు. ఎక్స్ లో ఈ ఫొటో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోపై యూజర్ల వారి టాలెంట్ కొద్ది స్పందిస్తూ కామెంట్లు చేస్తు్న్నారు.