- షాద్ నగర్ లో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం
షాద్ నగర్,వెలుగు: గత ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఉద్యమకారులను మోసం చేయొద్దని ఉద్యమకారుల సంక్షేమ సంఘం షాద్ నగర్ అడ్ హక్ చైర్మన్ పి.వెంకట్రాంరెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారులైన నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారులు అనుభవించిన,అనుభవిస్తున్న సమస్యల అంశాలను సమ్మేళనంలో చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో ఆరు తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ పి.వెంకట్రాంరెడ్డి మాట్లాడారు. అన్ని వర్గాలతో చర్చించి నియోజకవర్గ మండల స్థాయి ఉద్యమకారుల కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాంబాల్ నాయక్, రాజ్యలక్ష్మి, మంగులాల్ నాయక్, ఎమ్మే సత్తయ్య, భూపాల్ చారి, రాజ వరప్రసాద్, నక్కల వెంకటేశ్, కుడిచర్ల నరసింహారెడ్డి, దిలీప్ కుమార్, జాంగారి రవి తదితరులున్నారు..