సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల అకాంక్షలను..చట్టాలుగా మార్చి పాలన కొనసాగిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్ లో వున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామ ప్రజలకు 18 కోట్ల రూపాయలను అందజేశామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రుణమాఫీ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు.
ALSO READ | ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా సంక్షేమమే మా బాధ్యత: ఎంపీ వంశీకృష్ణ
రైతులకు ఇన్స్యూరెన్స్ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్న భట్టి... 2030 వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 20 వేల మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తి దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులకు ఆదాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా 30 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ పవర్ అందించనున్నామన్నారు. మేడారం గ్రామాన్ని సోలార్ పవర్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా 18 వేల కోట్ల రూపాయలను 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేదనన్న ఉపముఖ్యమంత్రి ఎల్లంపల్లి ముంపు గ్రామస్తులకు పెండింగ్ లో ఉన్న 18 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.