పేరెంట్స్​.. పిల్లల విషయంలో అతి జోక్యం వద్దు... ఎందుకంటే..

పేరెంట్స్​.. పిల్లల విషయంలో అతి జోక్యం వద్దు... ఎందుకంటే..

ఏ పేరెంట్స్ కైనా పిల్లల మీద ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. చదువు విషయంలో అవి మరీ ఎక్కువ. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే 'డాక్టర్ కావాలి. ఇంజినీర్ కావాలి' అని కలలు కంటూ ఉంటారు. దాని కోసం 'చదువు.. చదువు' అంటూ వాళ్లపై ఒత్తిడి పెంచుతారు. కొందరేమో 'వాడే చదువుతాడు లే' అని అసలే పట్టించుకోకుండా వదిలేస్తారు. ఈ రెండూ మంచివి కావంటున్నారు నిపుణులు.


చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి తేవడం  అంత మంచిది కాదు. వాళ్లలో ఉన్న స్పెషల్ టాలెంట్​ ను గుర్తించకుండా కేవలం ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకోవడం వల్ల పిల్లల ప్యూచర్ అయోమయంలో పడుతుంది. అందుకే పిల్లల్ని చదువులో ప్రోత్సహిస్తూనే... వారి అభిరుచికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. 

Also Read :- టీవీ చూస్తూ.. తింటున్నారా.. ఆరోగ్యానికి ఇబ్బందులే..

  •  పిల్లల ఇష్టానికి తగ్గట్టు చదువుల్లో ముందుకు సాగేలా పేరెంట్స్ ప్రోత్సహించాలి. ఇంట్లో దానికి తగిన వాతావరణాన్ని కల్పించాలి. 
  •  క్లాస్​ లో  ఉండే పిల్లలందరి మెమరీ పవర్ ఒకే స్థాయిలో ఉండదని పేరెంట్స్ గుర్తించాలి. హోం వర్క్ చేయడంలో పిల్లలకు సాయం చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ దే. అయితే, హోం వర్క్ విషయంలో' ఇలా చేయాలి. అలా చేయాలి' అని సూచనలివ్వాలి. కానీ, పేరెంట్సే ఆ హోం వర్క్ చేయకూడదు. ఇలా అతిగా జోక్యం చేసుకోవడం వల్ల పేరెంట్స్ పైనే డిపెండ్ అవుతారు. దాంతో వాళ్లు సొంతంగా ఏ పనీ చేయలేరు.
  •  పిల్లల కెపాసిటీ, టాలెంట్ కి మించి పేరెంట్స్ ఫలితాలను ఆశించకూడదు. కొంచెం రియలిస్టిక్ గా ఆలోచించాలి. ప్రొగ్రెస్ రిపోర్ట్ వచ్చిన టైంలో పిల్లల కోణం నుంచీ ఆలోచించే ప్రయత్నం చేయాలి.
  •  ఎంతసేపూ స్కూల్లో చెప్పే పుస్తకాలనే చదవమనకుండా... లోక జ్ఞానాన్ని ఇచ్చే రకరకాల పుస్తకాల్ని చదివే అలవాటు పెంచాలి. ఇందుకు పేరెంట్సే వాళ్లకు కొత్తకొత్త పుస్తకాలను బహుమతులుగా ఇవ్వాలి. వీలైనప్పుడల్లా పిల్లల్ని కొత్త ప్రదేశాలకు తీసుకెళ్తే పిల్లల ఆలోచనా పరిధి పెరుగుతుంది.
  • పిల్లలు రోజూ స్కూల్​ కు  వెళతారు. వస్తారు" అన్నట్లే ఉంటారు చాలామంది పేరెంట్స్. 'పేరెంట్స్ మీట్' కూడా సరిగ్గా అటెండ్ కారు. ఇది మంచిది కాదు. అప్పుడప్పుడు స్కూల్ కి వెళ్ళి, టీచర్స్ ని కలిసి పిల్లల మీద వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి.. దాంతో పిల్లల బలాలు బలహీనతలు తెలుస్తాయి. వాళ్లపై మీకున్న అపోహలు కూడా తొలగిపోతాయి. వాళ్లకు కావాల్సింది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.
  •  చదువు విషయంలో పిల్లలను తోటి విద్యార్థులతో పోల్చి ఇన్సల్ట్ చేయకూడదు. దీనికి బదులు పాజిటివ్ సలహాలిస్తూ ప్రోత్సహించాలి.
  •  చదువుతోపాటు ఆటపాటలు ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి కేవలం చదువేకాకుండా రోజూ కొంతసేపు ఆటలు, ఎక్సర్ సైజ్ కి కూడా కేటాయించాలి..
  •  మానసిక, కంటిచూపు లోపాలు వంటి పుట్టుకతో వచ్చే కొన్ని సమస్యల వల్ల కూడా పిల్లలు చదువులో వెనకబడొచ్చు. ఇలాంటి సమస్యలుంటే ముందుగానే గుర్తించి ట్రీట్ మెంట్ ఇప్పించాలి.
  • పిల్లల లేత మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి. వాటిని పేరెంట్స్ నే అడుగుతారు. కాబట్టి విసుక్కోకుండా వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పి.. సంతృప్తి పరచాలి. విసుక్కుంటే.. పిల్లల ఆలోచన, ఆసక్తి, జిజ్ఞాస సన్నగిల్లుతాయి