చిన్నారి మిస్సింగ్‌పై స్పందించారు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి. బాలుడి మిస్సింగ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆస్పత్రిలో అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ద్వారా చిన్నారిని అపహరించిన మహిళను గుర్తు పట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
బాలుడి తల్లి భోజనం తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లిన సమయంలో కిడ్నాప్ జరిగింది. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం సరియైందికాదు.. పోలీసుల విచారణ కొనసాగుతోంది, త్వరలో బాలుడి ఆచూకీ లభ్యమవుతుంది ఆందోళన చెందొద్దని అని డాక్టర్ ఉషారాణి అన్నారు.