నిర్మల్, వెలుగు: ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్ ను నమ్మవద్దని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. సారంగాపూర్ మండలంలోని వైకుంఠాపుర్, ధని, బోరిగాం, సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్, గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో 6 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సాద సుదర్శన్, నర్సయ్య, రొడ్డ మారుతి, రామ్ రెడ్డి ,ఓడ్నాల రాజేశ్వర్, నక్క మధుకర్ రెడ్డి, దినేశ్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.